Friday, 11 September 2026 10:15:29 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

వర్షాభావంతో రైతు కన్నీరు.. ! జూపాడుబంగ్లాను కరువు మండలంగా ప్రకటించాలి..

పి.వెంకటేశ్వర్లు (సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి)

Date : 01 August 2026 05:53 PM Views : 82

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / జూపాడుబంగ్లా : జూపాడుబంగ్లా మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, రైతులను ఆదుకోవాలని సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ నంద్యాల జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. జూపాడుబంగ్లా కు చెందిన కౌలు రైతు రవీంద్ర 5 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట వర్షాభావంతో పూర్తిగా దెబ్బతిన్నది. చేతికి వచ్చే దశలో ఉన్న పంట ఎండిపోవడంతో చివరకు ట్రాక్టర్‌తో దున్నవలసి వచ్చినదని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి పంట నష్టాన్ని పరిశీలించిన అనంతరం పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో తక్కువ వర్షపాతం కారణంగా జూపాడుబంగ్లా మండలంలోని రైతులు సాగు చేసిన మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, మినుము, కంది తదితర పంటలు నష్టపోయాయని తెలిపారు. నంద్యాల జిల్లాలో వేలాది ఎకరాల్లో రైతులు, కౌలు రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పంట నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్‌తో సంబంధం లేకుండా ఎకరాకు రూ.40 వేల పరిహారం ఇవ్వాలని, రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని, రుణాలను రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు. రబీ సీజన్‌కు విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందించాలని, 60 ఏళ్లు దాటిన రైతులు, కౌలు రైతులకు నెలకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలని కోరారు. డిమాండ్లు పరిష్కరించకపోతే రైతులను సమీకరించి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జూపాడుబంగ్లా మండల కార్యదర్శి ఈ.నరసింహుడు, నందికొట్కూరు మండల కార్యదర్శి సామన్న, పగిడ్యాల మండల కార్యదర్శి గుంపుల త్యాగరాజు, కౌలు రైతు రవీంద్ర, మనోహర్, శరత్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :