ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / జూపాడుబంగ్లా : మండల కేంద్రమైన జూపాడుబంగ్లాలోని, ఏపీ మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ ను నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా పాఠశాలలోని వంట గది, ఇతర గదులు మరియు పరిసరాల పరిశుభ్రతను, విద్యార్థుల మధ్యాహ్న భోజనాన్ని, పాఠశాల పరిసరాలను, ముఖ్యంగా వంట గది అపరిశుభ్రంగా ఉండడాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో సమావేశమై, వారితో కలిసి భోజనం చేయడం జరిగింది. విద్యార్థుల సమస్యలను అడిగి తెసుకున్నారు. వారి సమస్యలను విని ఎమ్మెల్యే నివ్వెరపోయారు. ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు, సామర్థ్యానికి సరిపడా మధ్యాహ్న భోజనాలు లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఏపీ మోడల్ స్కూల్ వసతి గృహానికి సంబంధించి నిర్వహణను పరిశీలించి, మంచిగా పెట్టుకోవాలని సూచించడం జరిగింది. విధి నిర్వహణలో భాగంగా గతంలో జరిగిన ఒక సంఘటనపై ఎమ్మెల్యే మాట్లాడుతూ స్కూల్ సౌకర్యాలపై అందిన ఫిర్యాదుల మేరకే ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగిందన్నారు. వసతి గృహ సంరక్షణపై జిల్లా ఉన్నతాధికారికి ఫోన్ చేసి ఫిర్యాదు చేసి, మరల ఇటువంటి సంఘటన జరగకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే గిత్త.జయసూర్య తెలియజేశారు. పిల్లల ఆరోగ్యంతో చెలగాటం ఆడవద్దని అన్నారు. వేగవంతంగా వారి సమస్యల పరిష్కార దిశగా సిబ్బంది అడుగులు వేయాలని, లేకుంటే ఉపేక్షించే లేదని ఎమ్మెల్యే గిత్త.జయసూర్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్, మండల కన్వీనర్ పలచాని. మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ.రవీంద్ర, మాండ్ర. శివానందరెడ్డి పిఏ- మద్దిలేటి, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News