ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన పాములపాడులోని, బస్టాండ్ లో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్సై పి.తిరుపాలు ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై పి.తిరుపాలు సంఘ విద్రోహ, అసాంఘికగా కార్యకలాపాలు జరగకుండా, ముందు జాగ్రత్తగా వాహనాలను, దుకాణాలను తనిఖీ చేయడం జరిగింది. మరియు తాగి వాహనాలు నడిపే మందుబాబుల కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమానికి కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ తవేశ్వర్, హోంగార్డ్ పవన్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News