Friday, 11 September 2026 10:18:37 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

ఆరు తడి పంటలకు కేసీ.కెనాల్ కు నీరు ఇవ్వాలి :- సిపిఎం, ఏపీ రైతు సంఘం నాయకులు

Date : 19 August 2026 08:35 PM Views : 99

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : రైతులు వేసుకునే విధంగా ఆరుతడి పంటలకు కేసీ కెనాల్ కు నీరు ఇవ్వాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి డి.స్వామన్న, ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టి.వెంకటేశ్వరరావు లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడుతూ రైతులు జూన్ లో  కురిసిన తొలకరి వర్షాలకు   పంటలు వేసుకున్నారని అయితే జూన్, జూలై నెలలో వర్షాలు సరిగా పడక పోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారని కనీసం పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గత సంవత్సరంలో అరకొర పంటలు చేతికి వచ్చినప్పటికీ కనీస మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయారని ఈ ఖరీఫ్ సీజన్ లో కూడా పంటలు వేసి రైతులు వర్షాలు లేకపోవడంతో వాటిని దున్నివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కేసీ.కెనాల్ నీరు రావడం వల్ల రైతులు  ఆరుతడి పంటలకు వేసుకునే విధంగా నీరు ఇవ్వాలన్నారు. కెసికి నీరు త్రాగునీటి కోసం వదిలారని అధికారులు చెబుతున్నారని, మరి రైతుల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు ప్రజా ప్రతినిధులు ప్రతిరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారని రైతుల గురించి మాత్రం పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రైతుల గురించి పదేపదే గొప్పలు చెబుతున్నారు. తప్ప వారిని పట్టించుకున్న పాపాన పోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు కేసి కెనాల్ కింద ఉన్న పొలాలకు ఆరుతడి పంటలకు మీరు ఇచ్చే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రజాప్రతినిధులు కూడా అధికారులతో మాట్లాడి నీరు తూములకు వదిలే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎస్.బాలయ్య, సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :