Tuesday, 28 July 2026 06:02:30 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

ఏపీలో జూనియర్ లాయర్లకు స్టైఫండ్ 5వేల నుండి రూ.10వేలకు పెంపు పట్ల హర్షం వ్యక్తం చేసిన టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి జి.నాగముని

Date : 05 July 2026 05:14 PM Views : 166

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలోని, జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఏపీ ప్రభుత్వం న్యాయ, మైనార్టీ శాఖల్లో కీలక నిర్ణయాలు తీసుకుందనీ, జూనియర్ లాయర్ల స్టైఫండ్ ను 5వేల నుంచి రూ.10 వేలకు పెంచడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు మరియు మంత్రి ఎన్ఎండీ ఫరూక్ లకు టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి జి.నాగముని ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ & ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.నాగముని మాట్లాడుతూ జూనియర్ న్యాయవాదులకు 5,000/- నుండి 10,000/- వరకు గౌరవ వేతనం పెంచడం చాలా సంతోషించేదగిన విషయమన్నారు. జూనియర్ లాయర్లు తక్కువ వేతనంతో పెరిగిన ఖర్చులకు చాలా ఇబ్బందులు పడేవారని అన్నారు. అలాగే కొత్తగా మంజూరైన 96 కోర్టులకు, 1770 పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. కర్నూలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కూడా చర్యలు చేపడుతున్నట్లు ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని తెలియజేశారు. రెండేళ్లలో మైనార్టీ సంక్షేమానికి కూడా రూ.16 వేల కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించామని మైనార్టీ సంక్షేమ & న్యాయ శాఖ మంత్రి ఫరూక్ తెలియజేయడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ న్యాయవాదులందరికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :