Tuesday, 28 July 2026 06:59:53 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

అక్రమాలకు పాల్పడుతున్న విలేజ్ బుక్కీపర్లపై చర్యలు తీసుకోండి

ఎంఆర్పిఎస్ డిమాండ్

Date : 03 March 2026 08:38 AM Views : 152

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండల ఎంపీడీవో కి.వినతి పత్రం సమర్పించిన ఎమ్మార్పీఎస్ నాయకులు... ప్రభుత్వం మహిళా సాధికారత కోసం పొదుపు సంఘాల ఏర్పాటు చేసి గ్రామీణ నిరుపేద మహిళలను లక్షాధికారులను చేసే దిశగా మహిళలకు అవగాహన కల్పించి ప్రభుత్వ నిధులతోడ్పాటును అందిస్తూ ఐక్య సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది ఐక్య సంఘాల పరిధిలో చదువుకున్న నిరుద్యోగులను బుక్కిపరులుగా నియమించింది‌. అయితే బుక్కిపరులుగా కొంతమంది పురుషులను నియమించడంతో. వారి వారి కుటుంబ సభ్యులను ఐక్య సంఘం లీడర్లుగా మరియు సిఎస్పీ.లుగా నియమించుకొని అక్రమాలకు పాల్పడుతున్నారు. కావున పొదుపు ఐక్య సంఘాల పరిధిలో బుక్కిపరులుగా పొదుపు గ్రూపులలో ఉన్న చదువుకున్న. మహిళలనే నియమించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు ప్రేమ రాజు మాదిగ, మండల అధ్యక్షుడు రాంప్రసాద్ మాదిగ ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకుడు ప్రేమ రాజు మాట్లాడుతూ పురుషులు బుక్కీర్లుగా ఉండడంతో గ్రామీణ ప్రాంతాల్లోని చదువురాని మహిళలను అమాయకులను చేసి, వారికి మాయమాటలు చెప్పి లోన్ గడువు. ఆరు ఏడు నెలలు ఉండగానే, బ్యాంకర్లతోటి. కుమ్మక్కై గతంలో తీసుకున్న లోన్ 6 నెలలు అసలు వడ్డీ కట్టించడంతో పాటు బుక్కీపర్ల కమిషన్ డిమాండ్ చేస్తూ వారి పబ్బం గడుపుకొని లక్షల రూపాయల ప్రజాధనాన్ని అక్రమాలకు పాల్పడుతున్నారు. బ్యాంకర్లతో బుక్ కీపర్ లు కుమ్మక్కై. పొదుపు మహిళలతో వేలిముద్ర సంతకాలు వేయించుకొని. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పొదుపు మహిళలకు తెలియకుండానే స్వాహ చేస్తున్నారని అన్నారు. అలాంటి వాటిపై. చర్యలు తీసుకోవాలని గతంలో వెలుగు ఏపీఎం కి ఫిర్యాదు చేసిన పట్టించుకోకుండా వారిపై ఎలాంటిచర్యలు తీసుకోనందునే..ఈరోజు ఎంపీడీవో-ఎన్.చంద్రశేఖర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇకనైనా త్వరగా మేలుకొని చర్యలు చేపట్టకపోతే జిల్లా ఉన్నత స్థాయి అధికారులు దృష్టికి పొదుపు మహిళలతో కలిసి తీసుకొనివెళ్తామని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇకనుండి అయినా మండల స్థాయి అధికారులు గ్రామాలను సందర్శించి గ్రామసభలు ఏర్పాటు చేసి పొదుపు మహిళలకు అవగాహన కల్పించాలని కోరుచున్నాము. మండలంలో అక్రమాలకు పాల్పడుతున్న.బుక్ కీపర్ లను.వెంటనే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. బుక్ కీపర్లు. వారి ఇంటి దగ్గరే బుక్కులు రాయడం వల్లనే ఈ సమస్య పునరావృతం అవుతున్నది కాబట్టి ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని మండల ఎంపీడీవో కి మరియు ఏపీఎం కి తెలియజేస్తున్నాం అన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై.చర్యలు. చేపట్టకపోతే జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తాం అని అన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :