ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : బిల్డింగ్ పినలైజేషన్ స్కీం ( బిపీయస్) కొరకు అవసరమైన వారు ఇకపై స్వయంగా దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.లక్ష్మిశ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. లైసెన్స్ టెక్నికల్ పర్సన్ (ఎల్ టిపి) లు అన్యాయమైన పద్ధతులకు పాల్పడుతున్నాయని మరియు దరఖాస్తులను దాఖలు చేసే సమయంలో ప్రజల నుండి అదనపు మొత్తాన్ని వసూలు చేస్తున్నారని ప్రజల నుండి వస్తున్న ఫిర్యాధుల నేపథ్యంలో ప్రభుత్వం బిల్డింగ్ పినలైజేషన్ స్కీం కు ప్రజలే స్వయంగా ధరఖాస్తు చేసుకునేలా ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందన్నారు. లైసెన్స్ టెక్నికల్ పర్సన్ ప్రమేయం లేకుండా పౌరులు నేరుగా దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించిన అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని వార్డు సచివాలయాల ద్వారా బిపిఎస్ దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ విలేకరుల సమావేశంలో తెలిపారు.
Admin
E Nivas News