Friday, 11 September 2026 08:13:18 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

అమరావతి ఛాంపియన్ షిప్ లో శ్రీశైలం నియోజకవర్గాన్ని విజేతగా నిలపాలి

ఎస్.బేబీ(మున్సిపల్ కమిషనర్), ఏ.షహబుద్దీన్(సింగిల్ విండో చైర్మన్)

Date : 16 August 2026 09:36 PM Views : 160

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : శ్రీశైలం నియోజకవర్గ క్రీడాకారులకు అన్ని విధాలుగా క్రీడలు ఆత్మకూరు స్టేడియంలో నిర్వహిస్తున్నారని వారిని సహకరించి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో పాల్గొనేలా చేస్తున్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ని దాతలు ఆదర్శంగా తీసుకోవాలని ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ తెలిపారు. ఈ సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని, కెవికె స్టేడియంలో నిర్వహిస్తున్న కబడ్డీ క్రికెట్ వాలీబాల్ కోచింగ్ క్యాంపు లను సింగిల్ విండో చైర్మన్ ఏ.షహాబుద్దీన్ మరియు స్పోర్ట్స్ క్లబ్ కోశాధికారి పఠాన్.నాగూర్ ఖాన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మకూరులో కబడ్డీ, క్రికెట్, వాలీబాల్ క్యాంపులు నిర్వహించడం గర్వించదగ్గ విషయం అన్నారు. ఈ క్యాంపుకు భోజన వసతి కల్పిస్తున్న ఒంగోలు గౌతమి ఫౌండేషన్ చైర్మన్ అంకయ్య చౌదరి కి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ ఏ.షహాబుద్దీన్ మాట్లాడుతూ స్టేడియంలో క్రీడాకారులకు తనవంతు సహాకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. స్టేడియంలో క్రీడాకారులకు శిక్షకులచే మెలకువలు నేర్పి మంచి ఫలితాలు సాధించేలా చేస్తున్నా స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ పస్పిల్ మున్నాను అభినందించారు. ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ కోశాధికారి పఠాన్.నాగుర్ ఖాన్ మాట్లాడుతూ క్రీడాకారులకు జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనేలా అందరూ కష్టపడాలని సూచించారు. చదువుతో పాటు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనాలన్నారు. ప్రతి ఒక్కరు చదువుతో పాటు, క్రీడల్లో రాణించి దేశానికి మంచి పేరు తేవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ కోశాధికారి పఠాన్.నాగుర్ ఖాన్, జూనియర్ కళాశాల అధ్యాపకులు అబ్దుల్ జబ్బార్, బాక్సింగ్ శిక్షకులు ఉపేంద్ర, స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు అబ్దుల్ హుస్సేన్ మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :