Friday, 11 September 2026 09:33:37 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

ఏడి చెన్నకేశవులు ను వెంటనే సస్పెండ్ చేయాలనీ శ్రీకాకుళం జర్నలిస్టుల డిమాండ్

Date : 02 August 2026 06:16 AM Views : 91

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : శ్రీకాకుళం జిల్లా సమాచార & పౌర సంబంధాల శాఖలో పనిచేస్తున్న ఏడి చెన్నకేశవుల వ్యవహార శైలిని నిరసిస్తూ స్థానిక పత్రికల ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు శ్రీకాకుళం ప్రెస్ క్లబ్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ జిల్లా డీపీఆర్‌ఓ కార్యాలయం జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోవడం లేదని, ముఖ్యంగా అక్రిడేషన్ కార్డుల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ప్రభుత్వ పరంగా అందాల్సిన గుర్తింపు, సహకారం, సమాచారంలో నిర్లక్ష్యం కొనసాగుతోందని వారు ఆరోపించారు. ఇటీవల జరిగిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం వంటి ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ కార్యక్రమానికి స్థానిక జర్నలిస్టులకు తగిన ఆహ్వానాలు అందించకపోవడం, మీడియా కవరేజ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయకపోవడం పట్ల సమావేశంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఈ విషయంలో సంబంధిత అధికారుల వైఫల్యంపై పలువురు జర్నలిస్టులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సమావేశంలో పాల్గొన్న పలువురు, జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఏడి చెన్నకేశవులపై ప్రభుత్వం వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జర్నలిస్టులకు పెండింగ్‌లో ఉన్న అక్రిడేషన్లను తక్షణమే మంజూరు చేయాలని కోరారు. జర్నలిస్టుల పట్ల అవమానకరమైన వ్యాఖ్యలు, దురుసు ప్రవర్తన సహించబోమని సమావేశంలో పలువురు నాయకులు పేర్కొన్నారు. పరిస్థితిలో మార్పు రాకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన వార్తల ప్రచురణపై సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించినట్లు సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్టులు ఎన్. ఈశ్వరరావు, పేడాడ శ్యాంసుందర్, ఎం.వి. మల్లేశ్వరరావు, గురిగిబిల్లి నాగభూషణ్, డా. డోల.అప్పన్న, బొడ్డేపల్లి రాజేష్, ఆకుల మాధవ, గోండు జనార్దన్‌రావు, కళ్యాణ్ పెద్దకోట, కొంచెం చిన్నారావు, రాము, సింగూరు శ్రీనివాసరావు, బొడ్డ కృష్ణారావు, జిల్లా వాణి ఈశ్వరరావు, పొడుగు రాజు, అద్దంకి సురేష్, బద్రి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. (ఆదివారం) ఉదయం 10:00 గంటలకు శ్రీకాకుళం ప్రెస్ క్లబ్‌లో జరగనున్న అత్యవసర సమావేశానికి జర్నలిస్టులు, స్థానిక పత్రికల ప్రతినిధులు అందరూ తప్పనిసరిగా హాజరై ఐక్యతను చాటాలని సమావేశ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :