ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : నంద్యాల జిల్లా, శ్రీశైలం నియోజకవర్గం, ఆత్మకూరు పట్టణంలోని, ఎల్. వి.ఫంక్షన్ హాల్ నందు రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మోమిన్ అహ్మద్ హుస్సేన్ కుమార్తె మరియు కుమారుడు నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మోమిన్ ముస్తఫా ల వివాహ వేడుకలో శ్రీశైలం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి, నంద్యాల పార్లమెంట్ ఇంచార్జ్ ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి, నందికొట్కూరు నియోజవర్గం మాజీ ఎమ్మెల్యే తోగూరు.ఆర్థర్, నియోజకవర్గ నాయకులు శిల్పా. భువనేశ్వర్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం- అంజాద్ భాష, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని.రాంభూపాల్ రెడ్డి, ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే ఏరాసు.ప్రతాపరెడ్డి, వైయస్సార్సీపీ నాయకులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి.రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ కే.ఈ.ప్రభాకర్, కర్నూలు మాజీ ఎమ్మెల్యే గఫూర్, సామాజికవేత్త డాక్టర్ డి.నాగన్న, గిరిజన ఉపాధ్యాయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జవహర్ నాయక్, ఆత్మకూరు సింగిల్ విండో చైర్మన్- ఏ.షహబుద్దీన్, పి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి-సయ్యద్.చాంద్ భాష, పాములపాడు మండల కో- ఆప్టెడ్ మెంబర్ సయ్యద్.ముర్తుజాఅలీ, మండల వైస్ ఎంపీపీ బండ్లమూరి.వెంకటేశ్వర్లు, మండల నాయకుడు ముడియాల.వెంకటరమణారెడ్డి, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వి.రామసుబ్బయ్య, వేంపెంట గ్రామ సర్పంచ్ వై.మాణిక్యమ్మ, నందికొట్కూరు నియోజవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.షాజహాన్ బేగం, సేవా భారతి (వై ఆర్ డి ఎస్) అధ్యక్షుడు- ఎస్.షర్ఫద్దీన్ అలీ, మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి. అంకన్న, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏ.రాజశేఖర్, ఉర్దూ అకాడమీ మాజీ డైరెక్టర్ సుకూరుమియా, తదితర ప్రముఖులు పాల్గొని, నూతన వధూవరులకు శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు తెలియజేశారు. ఈ వివాహ వేడుకలో వేల మందికి వెజ్, నాన్ వెజ్ కు సంబంధించిన రకరకాల వంటలు అతిధులకు విందు భోజనం వడ్డించడం జరిగింది. ఈ వలిమా వేడుకలో ఆత్మకూరు ముఫ్తీ.నూర్ మొహమ్మద్, గవర్నమెంట్ టీచర్ పి.నూర్ మొహమ్మద్, పాములపాడు హాజీ మహబూబ్ బాష, పట్టణ, గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు, నియోజకవర్గ వైఎస్ఆర్సిపి నాయకులు, జిల్లా వైఎస్ఆర్సిపి నాయకులు, ఇతర పార్టీ నాయకులు, బంధుమిత్రులు, మౌలానాలు, హఫీజ్ లు, అలీంలు, అన్ని ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News