Friday, 11 September 2026 09:43:01 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

అనుబంధాల వేదిక రాఖీ పండుగ -తమ్ముడి మణికట్టుపై అక్క ప్రేమ పాఠాలు :- భావన వినోద్ కుమార్(టిడిపి కల్చరల్ అధ్యక్షుడు

Date : 29 August 2026 01:32 AM Views : 60

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, బుద్ధ నగర్ గ్రామంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా తన అక్క, తమ్ముడైనటువంటి టిడిపి పాములపాడు మండల కల్చర్ అధ్యక్షుడు భావన వినోద్ కుమార్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా భావన వినోద్ కుమార్ తన అక్కకు కృతజ్ఞతలు తెలియజేసి మాట్లాడుతూ *రక్షాబంధన్‌ ఎలా మొదలైంది*. రక్షాబంధన్‌ పుట్టుకకు సంబంధించి అనేక కథనాలు ఉన్నాయి. హిందూ పురాణాలు, ఇతిహాసాల్లో రక్షా సూత్రం గురించి పలు కథనాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఇంద్రుడు–ఇంద్రాణి, శ్రీకృష్ణుడు–ద్రౌపది, లక్ష్మీదేవి–బలి చక్రవర్తి కథలు రాఖీ సంప్రదాయంతో ముడిపడి ఉన్నాయన్నారు. రక్షాబంధన్‌ అంటే అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమను గుర్తుచేసుకునే పండుగ మాత్రమే కాదు.. రక్షణ, ఆప్యాయత, నమ్మకానికి ప్రతీకగా భావించే ప్రత్యేకమైన రోజు. ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున ఈ పండుగను జరుపుకుంటారనీ అన్నారు. ‘రక్ష’ అంటే రక్షణ, ‘బంధన్’ అంటే బంధం అని అర్థం. అందుకే రాఖీని రక్షణకు ప్రతీకగా భావిస్తారనీ అన్నారు. రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు.అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ.సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఈ రోజునే పాతది వదిలి కొత్త దానిని ధరిస్తారు.ఉపనయనం అయిన వారు జంధ్యాల పౌర్ణమి రోజు గాయత్రీ పూజచేసి కొత్త యఙ్ఞోపవీతాన్ని ధరించి పాతది తీసివేస్తారనీ అన్నారు. *ముగింపు:* కాలక్రమేణా ఈ రక్షాసూత్ర ఆచారం అన్నాచెల్లెళ్ల పండగగా రూపాంతరం చెందింది. రక్తసంబంధం ఉన్నా లేకపోయినా.. ప్రేమానురాగాలు, పరస్పర రక్షణను చాటిచెప్పే సంప్రదాయంగా నేటికీ ఈ రాఖీ పౌర్ణమి వెలుగొందుతోంది. ఈ రక్షాసూత్ర ఆచారం అన్నా,చెల్లెళ్ల పండగగా రూపాంతరం చెందిందన్నారు. రక్తసంబంధం ఉన్నా లేకపోయినా.. ప్రేమానురాగాలు, పరస్పర రక్షణను చాటిచెప్పే సంప్రదాయంగా నేటికీ ఈ రాఖీ పౌర్ణమి వెలుగొందుతోందనీ టిడిపి పాములపాడు మండల కల్చర్ అధ్యక్షుడు భావన వినోద్ కుమార్ తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: