Friday, 11 September 2026 10:26:37 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

ఈనెల 28న పాములపాడులో జరిగే జిల్లా కలెక్టర్ నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్ కోసం స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య

Date : 24 August 2026 08:04 PM Views : 171

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన పాములపాడులోని, జడ్పిహెచ్ఎస్ హైస్కూల్ మరియు మండల తహసీల్దార్ కార్యాలయం సోమవారం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, ఆత్మకూరు ఆర్డిఓ వెంకట శివ, తదితర అధికారులతో కలిసి శుక్రవారం నిర్వహించే పిజిఆర్ఎస్ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, ఆత్మకూరు ఆర్డీవో వెంకట శివ లు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కలెక్టర్ గ్రీవెన్స్ శుక్రవారం నందికొట్కూరు నియోజకవర్గంలోని, కొత్తపల్లి, పాములపాడు మండలాలకు చెందిన చెందిన గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రజలు అనేక సమస్యల కోసం నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ కు వెళ్లకుండా నియోజకవర్గంలోనీ, పాములపాడు ను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. శుక్రవారం నిర్వహించే పిజిఆర్ఎస్ కు నంద్యాల జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా, ఎస్పీ సునీల్ షోరాన్ రానున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజలందరూ జిల్లా కలెక్టర్ పాల్గొనే ప్రత్యేక గ్రీవెన్స్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకట శివ, మండల తహసీల్దార్ జి.సుభద్రమ్మ, ఇంచార్జి ఎంపీడీఓ సులోచన, ఎంఈఓ బాలాజీ నాయక్, హైస్కూల్ హెచ్ఎం ఎన్. శ్రీధర్ రెడ్డి, మండల టీడీపీ అధ్యక్షులు జి.రవీంద్ర రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకుడు చెల్లె హరినాథ్ రెడ్డి, పగిడ్యాల మండల కన్వీనర్ పలచాని మహేశ్వరరెడ్డి, మద్దూరు సొసైటీ చైర్మన్ వాడల జనార్దన్ రెడ్డి, మండల తెలుగు కల్చరల్ అధ్యక్షులు భావన వినోద్ కుమార్, రుద్రవరం నాయకుడు రాచపూడి సురేష్, తెలుగు యువత మండల అధ్యక్షులు షేక్.కరీంబాషా, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఎ- రవీంద్ర, అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :