Sunday, 13 September 2026 11:58:33 PM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

పాములపాడు గొల్ల కళ్యాణ్ కి టిడిపి ప్రమాద బీమా 5 లక్షలు పంపిణీ చేసిన నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

Date : 15 May 2026 10:33 PM Views : 155

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన పాములపాడు కు చెందిన గొల్ల కళ్యాణి కి నంద్యాల ఎంపీ డాక్టర్ భైరెడ్డి శబరి టిడిపి ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ పాములపాడు గ్రామానికి, చెందిన గొల్ల వెంకటేశ్వర్లు 2026, ఫిబ్రవరి-12వ తేదీన నంద్యాల జిల్లా సమీపంలోని, జిందాల్ ఫ్యాక్టరీలో లారీ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం గ్రామ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కుటుంబానికి అండగా నిలిచిన వ్యక్తిని కోల్పోవడంతో ఆయన భార్య కళ్యాణి ఇద్దరు చిన్న పిల్లలు తీవ్ర ఆర్థిక మరియు మానసిక వేదనలో ఉన్నారన్నారు. ఈ క్లిష్ట పరిస్థితిని గుర్తించిన పాములపాడు గ్రామానికి చెందిన జిల్లా టెలికాం అడ్వైజర్ కమిటీ సభ్యుడు & తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు కురువ.రమేష్ బాధిత కుటుంబ పరిస్థితిని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి కి వివరించి, తెలుగుదేశం పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా కింద రూ.5 లక్షల ఆర్థిక సహాయం త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పేద కుటుంబం ఎదుర్కొంటున్న బాధను మనస్ఫూర్తిగా పరిగణనలోకి తీసుకున్న నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి వెంటనే స్పందించి, ప్రమాద బీమా కింద రావలసిన రూ.5 లక్షల రూపాయలు సహాయం త్వరగా కుటుంబానికి అందేలా పార్టీతో మాట్లాడి చర్యలు చేపట్టడం అభినందనీయం అన్నారు. అంతేకాకుండా, వెంకటేశ్వర్లు భార్య గొల్ల.కళ్యాణి కి వితంతు పింఛన్ కూడా మంజూరు అయ్యేలా, పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. టిడిపి సభ్యత్వ ప్రమాద బీమా ఐదు లక్షల రూపాయలు రావడానికి కృషిచేసిన నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి.శబరమ్మ కు, పాములపాడు టిడిపి యువ నాయకుడు కురువ రమేష్ కు గొల్ల.కళ్యాణి, ఆమె కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బైరెడ్డి అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :