ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలోని, ఆదర్శ నర్సింగ్ హోమ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో నీట్ పరీక్ష లీకేజ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని నేషనల్ ఓబీసీ మోర్చా- భామ్సెప్ సంస్థ రాష్ట్ర కార్యదర్శి & సామాజికవేత్త డాక్టర్ డి.నాగన్న, సాఫ్ట్వేర్ ఇంజనీర్ పగిడ్యాల శివ పాములేటి లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నేషనల్ ఓబీసీ మోర్చా (బామ్ సేఫ్) సంస్థ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ డి.నాగన్న మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు వివిధ నీట్ కోచింగ్ సెంటర్లలో దాదాపు రెండు లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రిపేర్ అయి, పరీక్ష రాయడం జరిగింది అన్నారు. కానీ ఈ నీట్ పరీక్ష పేపర్లు లీకేజీ అయినాయని రద్దు చేయడం జరిగింది. దీని కారణంగా నష్టపోయిన విద్యార్థులు 12 నుండి 15 మంది దాకా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనుక దీనికి బాధ్యత వహించి కేంద్ర విద్యా శాఖ మంత్రిని వెంటనే తొలగించాలని, ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు మద్దతుగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని, లడ్డాక్ ప్రాంతానికి చెందిన ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త & రామన్ మెగసెసే, రోలెక్స్ వంటి 17 జాతీయ- అంతర్జాతీయ అవార్డులు అందుకున్న గొప్ప అవార్డు గ్రహీత & సామాజికవేత్త సోనం వాంగ్ చుక్ గత 19 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారని, కానీ కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఆయనతో చర్చలు జరుపలేదన్నారు. కనుక ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వెంటనే చర్చలు జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. గతంలో ఇతని తండ్రి కూడా నిరాహార దీక్ష చేస్తే అప్పటి కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించడం జరిగింది. కనుక ఇకముందు కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్షలు రద్దుచేసి దీని స్థానంలో గతంలో రాష్ట్రాలు నిర్వహిస్తున్న ఎంసెట్ పరీక్ష విధానాన్నే తీసుకురావాలని కోరారు. పీఎం నరేంద్ర మోడీ తీసుకొచ్చిన ఒకే దేశం -ఒకే పరీక్ష విధానం ప్రకారం ఎటువంటి మతకల్లోలాలు జరగకుండా మానవులుగా, మానవత్వంతో, మతసామరస్యంతో , అందరూ సుఖ సంతోషంగా మానవులుగా జీవించడానికి ఒకే దేశం-ఒకే భారతీయులం అని తీసుకురావాలన్నారు. అప్పుడే మనదేశంలో సమానత్వం సమాన అవకాశాలు న్యాయం స్థాపించబడతాయన్నారు. ఆత్మకూరు పట్టణంలో ఈరోజు చేయవలసిన నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం చాలా బాధాకరమన్నారు. ఈ దీక్ష ఒక వ్యక్తి కోసం కాదు, ఒక వ్యవస్థ మార్పు కోసం అని అన్నారు. విద్యార్థులకు విద్యా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలలో సమాన న్యాయం, పారదర్శకత ఉన్నప్పుడే దేశ భవిష్యత్తు బలపడుతుందన్నారు. నేటి పాలకులు మతాలుగా, కులాలుగా విభజించి, గొడవలు పెట్టి స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. కనుక ఈ అంద విశ్వాసాలను దూరం చేయడానికి శాస్త్రవేత్తలు, మేధావులు, వైద్యులు, సామాజికవేత్తలు, విద్యావేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. అప్పుడే మన దేశంలో మతసామరస్యం వెల్లువిరిసి అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో అన్నదమ్ములుగా జీవిస్తారని ఆకాంక్షించారు.
Admin
E Nivas News