Monday, 14 September 2026 07:18:05 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

పాములపాడు సీఎస్ఐ చర్చిలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్ వేల్పుల.ఆనంద్ కుమార్

Date : 24 December 2025 08:18 PM Views : 321

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన పాములపాడులో ఉన్నటువంటి సిఎస్ఐ సంఘము చర్చిలో రెవరెండ్. వేల్పుల.యం.మోహన్ రాజ్ గాంధీ వారి ఆధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల ప్రార్ధన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేల్పుల.ఆనంద్ కుమార్ రావడం జరిగింది. వారు మాట్లాడుతూ మనకోసం మన పిల్లల కోసం యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మానవ రూపంలో ఈ భూలోకంలో మన కోసం జన్మించారు. ఆయన ప్రేమ, కరుణ, ద్వారానే మానవాళికి ఆనందం, నింపిన యేసుక్రీస్తు జీవితం అందరికి ఆదర్శప్రాయంగా, ఏసుక్రీస్తు జన్మదిన పర్వదినాన్ని, ప్రజలంతా ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆనందం నింపడానికి, శత్రువుల సైతం మంచి ప్రవర్తనతో, మారుమనస్సు పొంది, ప్రతి ఒక్కరూ నిత్య పరలోక రాజ్యానికి, వారసులం కావాలని అజ్ఞానం నుండి విజ్ఞానo వైపు నడిపేది ఒక దైవస్వరూపం అని యేసుక్రీస్తు మనకోసం కన్యకా అయిన గర్భవతి మరియమ్మకి యేసుక్రీస్తు జన్మించారు. ఎందుకు అంటే మన కోసం మనం అందరం పరలోకానికి వారసులం కావాలని, కాబట్టి ఈ లోకం శాశ్వతం కాదని ప్రతి క్యాండిల్ లైట్ సర్వీస్ అంటే మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రతి ఒక్కరి కుటుంబాల్లో వెలుగులు నింపుతారు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుడు దీవెనలు మీకు ఉండాలని మనసారా కోరుకుంటున్నానని చెప్పడం జరిగింది. పాస్టర్ యు.రాజు దైవ సందేశం ఇస్తూ ప్రతి ఒక్కరు శాంతి, సమానత్వం, ప్రేమ, దయ కలిగి దేవుడికి భయభక్తులు కలిగి జీవించాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా పాములపాడు పాస్టర్ మోహన్ గాంధీ మాట్లాడుతూ ఈరోజు మన మండల కేంద్రంలో సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్ వేల్పుల.ఆనంద్ కుమార్ రావడం చాలా గొప్పగా అదృష్టంగా భావించాలన్నారు. అంతేకాకుండా వేల్పుల ఆనంద్ కుమార్ మన మండలంలో చర్చిలకు, దేవాలయాలకు, పీర్ల చావిటీలకు, గణేష్ విగ్రహాలకు గతంలో ఆర్థిక సహకారం అందించడం జరిగిందని అన్నారు. ఈరోజు మిట్టకందాల గ్రామంలోని, చర్చికి చేసిన ఆర్థిక సహాయం చాలా గొప్పదన్నారు. ఒక్కటే కాదు అడిగిన ప్రతి ఒక్కరికి సేవా గుణంతో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఇంకా ఇంకా మున్ముందు మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, అందరి మన్ననలు పొందాలని మరీమరీ కోరుకుంటున్నాను. వేల్పుల.ఆనంద్ కుమార్ కుటుంబంలో అందరికీ పిల్లాపాపలకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు దేవుడు దీవెనలను ఇవ్వాలని పాస్టర్ మోహన్ గాంధీ చెప్పడం జరిగింది. మౌనిక పాస్టరమ్మ దేవుడు పాటలతో దేవుడు మహిమపరచారు. యు.రాజు దైవ సందేశం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ దేవునికి వారసులం కావాలని, చెడు పనులు వదిలేసి మారు మనసు కలగాలని, ప్రతి ఒక్కరి గుండెల్లో యేసుప్రభూ చేర్చుకోవాలని, అందరూ పరలోక రాజ్యానికి వారసులం కావాలని వివరించారు. అంతేకాకుండా ప్రార్థనకి వచ్చిన ముఖ్యఅతిథి ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్ వేల్పుల ఆనంద్ కుమార్ కి సీఎస్ఐ సంఘస్థూలు శాలువాలు కప్పి, పూలమాలలు మెడలో వేసి ఘనంగా సన్మానించడం జరిగింది. అంతే కాకుండా వచ్చిన మిగతా ముఖ్య అతిధులకు కూడా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలు పాడిన దేవుడి పాటలతో, దేవుని నృత్యాలతో, చక్కటి సంగీత బృందంతో దేవుడికి మహిమ కరముగా జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేల్పుల ఆనంద్ కుమార్ సైన్యం బీసీ ఐక్య సంఘం అధ్యక్షుడు-గట్టు.శంకర్, జాతీయ బీసీ సంఘం ప్రధాన డాక్టర్ బత్తుల.సంజీవ రాయుడు, ఎల్లగౌడ్, వినోద్, సోషల్ మీడియా ప్రతినిధి డక్కా.శ్రీకాంత్, మేకల.భాస్కర్ అంతే కాకుండా సిఎస్ఐ సంఘములో సంఘ పెద్ద మనుషులు, సండే స్కూల్ టీచర్ అనురాధ, స్త్రీల మైత్రి వారు పాల్గొనడం జరిగింది. కలబండి, విజయ భాస్కర్, కలబండి, బాలరాజు, రఘు, అంబేద్కర్ యూత్ నాయకుడు కలబండి.నాగరాజు ఆధ్వర్యంలో అద్భుతంగా చేసిన పరిచర్యలో వాడబడటం, మరియు జాతీయ మాల మహానాడు రాయలసీమ అధ్యక్షులు నల్లమల్ల.అబ్రహం, మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు- కలబండి.అంకన్న లు వచ్చిన వారందరికీ ప్రేమ విందు పెట్టడం జరిగింది. సంఘము విశ్వాసులు, పెద్దలు కలిసి సెమీ క్రిస్మస్ వేడుకలు విజయవంతంగా జరిగాయి.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :