Thursday, 30 July 2026 12:41:07 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర పి ఆర్ టి యు మహాధర్నా

Date : 22 April 2026 06:18 AM Views : 133

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్, ఆంధ్ర ప్రదేశ్ సంఘం పిలుపు మేరకు మంగళవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద, పి ఆర్ టి యు నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎన్.వి.భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వై.రాంపక్కి రెడ్డి ల అధ్యర్యంలో మహా ధర్నాను చేపట్టారు. వెయ్యి మంది ఉపాధ్యాయులు పాల్గొన్న ఈ ధర్నాను ఉద్దేశించి జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఉద్యోగ , ఉపాధ్యాయులకు మెరుగైన పిఆర్సి, ఐఆర్, పెండింగ్ డిఎ లు వంటి అంశాలపై హామీ ఇచ్చిన ఇంత వరకు నెరవేర్చకపోవడం శోచనీయం అని వెంటేనే పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేసి, 30% ఐఆర్ చెల్లిస్తూ పెండింగ్ డిఎ లు విడుదల చేయాలని కోరారు. పి ఆర్ టి యు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన పాలకుల నిర్లక్ష్యం ఉద్యోగ, ఉపాధ్యాయుల పై అలాగే కొనసాగుతుందని, దీనిని అడ్డుకుంటామని, సిపిఎస్ రద్దు చేయాలని, 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ వర్తింపు చేయాలి, మెమో 57 అమలు పరచాలని, 2022 నుంచి పెండింగ్ లో వున్న సరెండర్ లీవ్ చెల్లించాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వై.రాంపక్కి రెడ్డి మాట్లాడుతూ అనేక ఆశలతో ఉపాధ్యాయులు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, 2 సంవత్సరాలైన మన ప్రధాన డిమాండ్లను పెండింగ్ లో పెట్టడం నిర్లక్ష్య ధోరణికి నిదర్శనంగా ఉందని, ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు అన్ని చెల్లించాలని, రిటైర్ అవుతున్న ఉపాధ్యాయులకు వారి పదవీ విరమణ రోజే వారి చెందాల్సిన ప్రయోజనాలు చెల్లించాలని, ఎం టి ఎస్ ఉపాధ్యాయులైన 1998,2008 వారిని రెగ్యులర్ చేయాలని, డీఎస్సీ వారికి 12నెలల జీతం చెల్లించాలి అని కోరారు. అలాగే ఎయిడెడ్, మున్సిపల్, మోడల్ స్కూల్, గిరిజన సంక్షేమ, కేజీబీవీ ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. చాలా పెద్ద ఎత్తున ఎండ ఉన్న కూడా కూడా, ఆ వేడినీ లెక్క చేయకుండా ఉపాధ్యాయులు నిరసన గళం ఎత్తారని, ఇకనైనా ప్రభుత్వం స్పందించకుంటే ఏప్రిల్-25వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్- జి.రాజకుమారి గణియా కి ఉపాధ్యాయ సమస్యలపై వినతి పత్రం అందించారు.

ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎస్.భార్గవ రామయ్య, రాష్ట్ర నాయకులు కె.కృష్ణారావు, గోపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, విజయ్ రావు, ఇబ్రహీం, రాంపుల్ల రెడ్డి, మధుసూదన్, వై.వి.రమణయ్య, పి.నూర్ మొహమ్మద్, హుస్సేన్ సాహెబ్, హనుమంతు, రవీంద్ర రెడ్డి, జాకీర్, కె.శ్రీనివాసులు, ఎస్.యం. బాషా, జేసీ నరసింహులు, సుమియన్, జగదీశ్ బాబు, జిల్లా నాయకులు, వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు, మహిళా ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :