ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / విజయవాడ : ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుండి సింగపూర్ కు విమాన సర్వీసులు ప్రారంభం కావడానికి కృషిచేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, రాష్ట్ర ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుకు సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు అభినందనలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భముగా పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామానికి చెందిన వరల్డ్ హ్యూమన్ రైట్స్ అవార్డు గ్రహీత & అంతర్జాతీయ సమాజ సేవకుడు & సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు మాట్లాడుతూ సింగపూర్ - విజయవాడల మధ్య నేరుగా విమాన సర్వీసులు ఈ రోజు ప్రారంభం కావడంతో విజయవాడ నుండి మొదటి ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న వారు ఏపీ సీఎం చంద్రబాబు కి, మంత్రి లోకేష్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారన్నారు. విజయవాడ నుండి మొదటి ఫ్లైట్లో ప్రయాణించిన వారందరికీ సింగపూర్ లో ఘన స్వాగతం పలుకుతున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లోని వారందరూ గతంలో హైదరాబాద్ నుండి ఢిల్లీ నుండి సింగపూర్ కి వెళ్ళవలసిన పరిస్థితి ఉండేది అన్నారు. ఇప్పుడు ఏర్పాటు చేసిన విమాన సర్వీసుల వలన మన తెలుగు వాళ్ళందరికీ గొప్ప అవకాశం లభించిందన్నారు.
Admin
E Nivas News