Monday, 14 September 2026 07:33:08 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ఏపీ ఎన్జీవోస్ ఆత్మకూరు తాలూకా అధ్యక్షుడుగా ఎస్.సాజిద్ బాష ఏకగ్రీవంగా ఎంపిక

Date : 01 June 2026 07:14 AM Views : 191

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆంధ్ర ప్రదేశ్ నాన్ గెజిటెడ్ అండ్ గెజిటెడ్ అధికారుల సంఘం ఆత్మకూరు తాలూకా అధ్యక్షుడిగా, ఖజానా శాఖ అధికారి సీనియర్ అకౌంటెంట్ ఎస్.సాజిద్ బాషాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రస్తుత తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి పదవీ విరమణతో ఖాళీ ఏర్పడిన అధ్యక్ష స్థానానికి జిల్లా పర్యవేక్షణ & ఎన్నికల అధికారిగా విచ్చేసిన జిల్లా సహాధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్.సాజిద్ బాషా ను ఏకగ్రీవంగా తాలూకా అధ్యక్షుడుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏపీ ఎన్జీవోస్ రాష్ట్ర సహాధ్యక్షుడు దస్తగిరి రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు హుస్సేన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నర్సారెడ్డి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడుగా ఎన్నికైన సాజిద్ బాషా మాట్లాడుతూ ప్రస్తుతం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నాపై వుంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని, ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడుతూ ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపుతామని తెలిపారు, జిల్లా, రాష్ట్ర నాయకులతో సమన్వయంగా ఉంటూ, ఉద్యోగుల కోసం 12 వ పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలని, 30% మధ్యంతర భృతి ఐ ఆర్ ప్రకటన విడుదల చేయాలని, సిపిఎస్ రద్దు చేయాలని, పెండింగ్ డిఎ ల విడుదల చేయాలని, ఉద్యోగుల ఆర్థిక బకాయిలు చెల్లింపు చేయాలనీ, సరెండర్ లీవ్ ప్రకటించాలని, తదితర అంశాలపై అందరితో కలిసి ప్రభుత్వం నుండి సాధిస్తామని అన్నారు. ఎస్.సాజిద్ బాషా ఎన్నిక పట్ల ఏపీ ఎన్జీవోస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ జెఎసి సభ్య సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :