Wednesday, 29 July 2026 06:32:54 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

గ‌ణ‌తంత్ర స్ఫూర్తితో వేడుక‌ల‌కు సిద్ధంకండి..! ప్ర‌గ‌తి ప‌థం, ప్ర‌జ‌ల‌ను చైత్య‌వంతుల‌ను చేసేలా శ‌క‌టాల ప్ర‌ద‌ర్శ‌న‌ చేయాలి

ఎన్‌టీఆర్ జిల్లాస్థాయి గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌పై క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ‌

Date : 22 January 2026 04:56 AM Views : 202

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : ఎన్‌టీఆర్ జిల్లాస్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలను గణతంత్ర స్ఫూర్తికి అనుగుణంగా ఘనంగా నిర్వ‌హించేందుకు అన్ని శాఖ‌ల అధికారులు స‌మన్వయంతో పనిచేసి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. ఈ నెల 26న విజ‌య‌వాడ పట్టణంలోని, ఇందిరాగాంధీ మునిసిప‌ల్ మైదానంలో ప్ర‌ప‌థంగా ఎన్‌టీఆర్ జిల్లాస్థాయి 77వ గణతంత్ర దినోత్సవ వేడుక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌ జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌ తో కలిసి బుధ‌వారం క‌లెక్ట‌రేట్ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో అన్ని శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. వేడుకలకు పటిష్టమైన, విస్తృత ఏర్పాట్లు చేయాలని.. ఏడాది కాలంలో ప్ర‌గ‌తి ప‌థాన్ని, సాధించిన విజ‌యాల‌కు అద్దం ప‌ట్టేలా ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతుల‌ను చేసేలా శ‌క‌టాల ప్ర‌ద‌ర్శ‌న ఉండాల‌న్నారు. స్వ‌ర్ణాంధ్ర విజ‌న్-2047, నియోజ‌క‌వ‌ర్గాల దార్శ‌నిక ప్ర‌ణాళిక‌లు, మ‌హిళా సాధికార‌త‌, వ్య‌వ‌సాయ, అనుబంధ రంగాల్లో సాంకేతిక‌త‌, పారిశ్రామిక ప్ర‌గ‌తి, వ‌న్ ఫ్యామిలీ-వ‌న్ ఆంత్ర‌ప్రెన్యూర్.. ఇలా వివిధ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల‌కు సంబంధించి శకటాల ప్రదర్శన నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు చేయాల‌న్నారు. వేదిక ఏర్పాట్లు, పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు, ప‌బ్లిక్ అడ్రెసింగ్ సిస్ట‌మ్‌, భద్రతా చర్యలు, ప్రజలకు సౌకర్యాలు కల్పించడం వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రజల్లో దేశభక్తి, ఐక్యత భావనను పెంపొందించేలా, ప్ర‌జ‌ల‌ను జాగృతం చేసి అభివృద్ధిలో భాగ‌స్వాముల‌ను చేసేలా ఉండాల‌న్నారు. జిల్లాస్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొననున్న దృష్ట్యా పటిష్టమైన బందో బస్తుతో పాటు సీటింగ్, ఇతర అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బందోబస్తు ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, కవాతు నిర్వహణ త‌దిత‌రాల‌పై దృష్టిపెట్టాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి జిల్లా విద్యాశాఖ అధికారి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మంలో డీఆర్‌వో ఎం.ల‌క్ష్మీన‌ర‌సింహం, విజ‌య‌వాడ ఆర్‌డీవో కావూరి చైత‌న్య‌, రెవెన్యూ, పోలీస్‌, విద్య‌, గృహ నిర్మాణం, డీఆర్‌డీఏ, వ్య‌వ‌సాయం, వివిధ శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: