ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండల పరిధిలోని, బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుండి తెలుగు గంగ కాలువకు 2000 క్యూసెక్కుల నీటినీ విడుదల చేసిన నీటిపారుదల శాఖ ఎస్ఈ శివశంకర్ రెడ్డి, తదితర అధికారులు తెలిపారు. గురువారం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి ఎస్ఆర్ఎంసి కాల్వ ద్వారా 2000 క్యూసెక్కుల నీటిని దిగవ కాలువకు విడుదల చేయగా, ఆ నీటిని బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుండి తెలుగు గంగ కాలువకు రెండువేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఎస్ఈ శివశంకర్ రెడ్డి, ఈఈ సుబ్రహ్మణ్యం రెడ్డి, ఏఈ దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News