Sunday, 13 September 2026 12:56:17 AM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

నిబంధనలు పాటిస్తేనే భద్రత..!

ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి

Date : 29 January 2026 12:52 AM Views : 137

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణం రవాణా శాఖ సేవలను పొందే ప్రతి వాహనదారుడు ప్రభుత్వ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని, తద్వారా సురక్షితమైన ప్రయాణాన్ని సాగించాలని ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవిఐ) సత్యనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా నిర్వహించిన సమీక్షా సమావేశం నేపథ్యంలో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దళారుల ప్రమేయం లేకుండా ఆన్‌లైన్ సేవలను పొందాలన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రవాణా శాఖ సేవలను పూర్తి పారదర్శకంగా మారుస్తున్నట్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. వాహన రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు లేదా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల కోసం దళారులను ఆశ్రయించి అదనపు సొమ్ము చెల్లించవద్దని, ప్రభుత్వం నిర్దేశించిన చలానా రుసుమును మాత్రమే ఆన్‌లైన్ ద్వారా చెల్లించి సేవలు పొందాలని సూచించారు. ఈ సందర్భంగా వాహనదారులకు ఎంవీఐ-సత్యనారాయణ రెడ్డి కీలక సూచనలు చేశారు. నకిలీ పత్రాల పట్ల జాగ్రత్త: ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్లు గుర్తింపు పొందిన కేంద్రాల్లోనే తీసుకోవాలన్నారు. నకిలీ పత్రాలతో పట్టుబడితే వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అధిక లోడింగ్ నివారణ: ఆటోలు, లారీలు పరిమితికి మించి ప్రయాణికులను లేదా సరుకును రవాణా చేయకూడదు. అధిక లోడింగ్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. రోడ్డు భద్రత: వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్, సీటు బెల్ట్ ధరించాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం నేరం. సకాలంలో ట్యాక్స్ చెల్లింపు: ప్రభుత్వానికి చెల్లించాల్సిన వాహన పన్నులను సకాలంలో చెల్లించి జరిమానాల నుండి తప్పించుకోవాలి. నంద్యాల జిల్లా కలెక్టర్- జి.రాజకుమారి గణియా ఆదేశాల మేరకు రవాణా శాఖను కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్‌లో 'ఎ' గ్రేడ్‌లో నిలబెట్టేందుకు ప్రతి వాహనదారుడు సహకరించాలని ఆయన కోరారు. ఇకపై నిబంధనలు అతిక్రమించే వాహనాలపై ప్రత్యేక బృందాలతో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంవీఐ- సత్యనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :