ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / జూపాడుబంగ్లా : హైదరాబాద్ పట్టణంలో, శ్రీ సత్య సాయి నిగమామంలో, ఈరోజు రుద్రా బెస్ట్ హెల్పింగ్ ఫౌండేషన్ స్వర్ణానంది మరియు ఆల్ ఇన్ వన్ టాలెంట్ అవార్డ్ ల ప్రధానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ సెలబ్రెటీలు, సినిమా డైరెక్టర్ లు, తెలంగాణ మినిస్టర్స్ ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది. రుద్ర స్టూడియో బెస్ట్ హెల్పింగ్ ఫౌండేషన్ వారు చైల్డ్ ఫ్యాషన్ షో విన్నర్ అవార్డుకు నౌషీన్ కు ఎంపిక చేయడం మరియు బెస్ట్ టాలెంట్ సింగర్ అవార్డుకు నందికొట్కూరు నియోజవర్గంలోని, జూపాడుబంగ్లా గ్రామానికి చెందిన టీ.షాజహాన్ బేగం ఎంపిక కావడం జరిగింది. డైరెక్టర్ రుద్రా శ్రీనివాస్, హీరోయిన్ శిరీష ల చేతుల మీదుగా టీ.షాజహాన్ బేగం అవార్డును అందుకోవడం జరిగింది. అవార్డులు ప్రధానం చేసిన సినిమా డైరెక్టర్ రుద్రా శ్రీనివాస్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపడం జరిగింది.
Admin
E Nivas News